సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నాడు. మహర్షి చిత్ర రిలీజ్ కు ముందు ఫ్యామిలీతో మహేష్ ప్యారిస్ టూర్ వెళ్ళాడు. వెకేషన్ ముంగించుకుని వచ్చి మహర్షి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మహర్షి విడుదలై మంచి విజయం సాధించింది. మహేష్ కెరీర్ లో అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా మహర్షి నిలిచింది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సందేశాత్మక చిత్రానికి ఆడియన్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఇటీవల మహర్షి విజయోత్సవం కూడా ముగిసింది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు తాను చేయాల్సిందంతా చేశాడు. తాజాగా ఫ్యామిలీతో కలసి మరోమారు వెకేషన్ కు వెళ్ళాడు. మహేష్ బాబు ఎక్కువగా తన ముద్దుల కుమార్తె సితారని గారాబం చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. కొడుకుపై ఒక్కసారిగా ప్రేమ తక్కుకుని వచ్చినట్లు ఉంది. అందుకే గౌతమ్ ని గట్టిగా గట్టిగా కౌగిలించుకుని ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు. 

ఆ ఫోటోని మహేష్ బాబు ట్విటర్ లో షేర్ చేశాడు. తండ్రి ముద్దులతో కొడుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. మహేష్ బాబు తదుపరి అనిల్ రావిపూడి చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం జూన్ లో ప్రారంభం కానుంది.