మహేష్ బర్త్ డే వేడుకలు ఘనంగా ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తనకు బర్త్ డే విషెస్ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మహేష్ బాబు ఈ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.  

ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు బర్త్ డే(Mahesh Babu Birthday) వేడుకలు జరిగాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా స్టార్స్ ఎవరూ బర్త్ డే వేడుకలు జరుపుకోలేదు. అలాగే కరోనా ఆంక్షల కారణంగా బహిరంగ సమావేశాలు, విందులు, వినోదాలు నిషేదించారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఏర్పడగా మహేష్ అభిమానులు బర్త్ డే వేడుకలు చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ కెరీర్ లో అత్యుత్తమ చిత్రాలుగా ఉన్న ఒక్కడు, పోకిరి స్పెషల్ షోస్ వేశారు. ఈ షోస్ కి విపరీతమైన స్పందన వచ్చింది. 

మహేష్ పేరిట ఛారిటీ కోసం ఈ వసూళ్లు ఉపయోగించనున్నారు. కోట్ల రూపాయల వసూళ్లు రావడం మహేష్(Mahesh Babu) క్రేజ్ ఏమిటో రుజువైంది. అలాగే సోషల్ మీడియా వేదికగా మహేష్ కి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. అభిమానులు, సన్నిహితులు, ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు మహేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

తనకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి మహేష్ ధన్యవాదాలు తెలిపారు. ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు. నాపై అపరిమితమైన ప్రేమ కురిపించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు, అభిమానులకు కృతజ్ఞతలు. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. గడచిన ఏడాది అద్భుతం... రానున్న భవిష్యత్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. 

ఇక సర్కారు వారి పాట మూవీతో మరో బ్లాక్ బస్టర్ మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలో ఆయన త్రివిక్రమ్ మూవీ షూట్ లో పాల్గొననున్నారు. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్న మహేష్ 28వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు రాజమౌళి మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి గత చిత్రాలకు మించి భారీ ఎత్తున ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు.