Asianet News TeluguAsianet News Telugu

#Gunturkaaram ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడ

 రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ఈ చిత్రం ప్రమోషన్స్ పెంచాలని టీమ్ ఫిక్సైంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వినికిడి.

Mahesh Babu #GunturKaaram Pre Release Event details jsp?
Author
First Published Dec 26, 2023, 11:51 AM IST

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో  ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్యాచ్ వర్క్ కు రెడీ అవుతోంది.   మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ఈ చిత్రం ప్రమోషన్స్ పెంచాలని టీమ్ ఫిక్సైంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వినికిడి.

అందుతున్న సమాచారం మేరకు.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‏లో లో  జనవరి 6 న జరపనున్నట్లు వినికిడి.  ఈ మేరకు త్వరలో అఫీషియల్ గా ప్రకటన రానుందని చెప్తున్నారు.  భారీ సంఖ్యలో ప్రీరిలీజ్ ఈవెంట్ వద్దకు మహేష్ ఫ్యాన్స్ తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చిత్రం ట్రైలర్ ని కూడా విడుదల చేస్తారు. గతంలో మహేష్ బాబు చిత్రం  `సర్కారు వారి పాట`కి ఇదే గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. 

ఇక `గుంటూరు కారం` చిత్రంలో శ్రీలలో పాటు  హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మాస్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తి అయినట్లే..  కొన్ని చిన్న చిన్న ఫ్యాచ్ వర్క్ లను కూడా ఈ నెల ఆఖరిలో పూర్తి చెయ్యనున్నట్లు తెలుస్తుంది.  ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే ఫ్యామిలీ తో కలిసి ఫారిన్‌ వెకేషన్‌కు వెళతారట మహేశ్‌బాబు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఫారిన్‌ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌ తో బిజీ అవుతారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది..  

`అతడు`, `ఖలేజా` చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  ఈ చిత్రాన్ని  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios