రికార్డ్ లు మడతపెడుతున్న మహేష్ బాబు కుర్చీ సాంగ్.. ప్యూస్ లోనే కాదు.. రీల్స్ లో కూడా..?
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా.. మ్యూజిక్ పరంగా.. అది కూడా ఒక్క పాట మాత్రం సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. గుంటూరు కారం సినిమాను జనాలు గుర్తుంచుకునేలా చేస్తోంది కుర్చీ సాంగ్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. శ్రీలీ హీరోయిన్ గా నటించిన మాస్ మసాల సినిమా గుంటూరు కారం. మాటల మాత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకోవడం అంటే బ్లాక్ బస్టర్ హిట్ కాదు కాని.. యావరేజ్ టాక్ తో నడుస్తోంది. మహేష్ బాబు సినిమా కాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి.
ఇక ఈమూవీ కంటే కూడా ఈసినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ బాగా పాపులర్ అవుతుంది. ఈసాంగ్ మాత్రం నిజంగా బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పాలి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల వేసిన స్టెప్పులు.. ఆఊపు చూసి.. సూపర్ స్టార్ కూడా షాక్ తిన్నారంటే మామూలు విషయం కాదు. శ్రీలీల డాన్స్స్.. ఆమె ఎనర్జీ గురించి ప్రీరిలీజ్ ఫంక్షన్ లో స్పెషల్ గా గుర్తు చేసుకున్నారు మహేష్ బాబు. ఇక ఈసారి మహేష్ కుడా కుర్చీ సాంగ్ కు అదరిపోయే స్టెప్పులు వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీర్లకు సిగ్నేచర్ స్టెప్పులు ఇవ్వడంలో దిట్ట శేఖర్ మాస్టర్. ఈ కుర్చీ సాంగ్ తో ఆయనో మెట్టు ఎక్కేశారు కూడా.
ఇక అసలు విషయానికివ వస్తే.. కుర్చీమడతపెట్టి సాంగ్ రికార్డ్ మీద రికార్డ్ లు సాధిస్తోంది. ఎక్కడ చూసినా.. ఈపాట.. ఈమ్యూజిక్ మారుమోగుతోంది. ప్యూస్ పరంగా మిలియన్ల కొద్ది సాధిస్తోన్న ఈ సాంగ్.. తాజాగా రీల్స్ పరంగా కూడా రికార్డు నెలకొల్పింది. ఏదైనా సినిమా నుంచి హిట్ సాంగ్ వస్తే.. దాన్ని రీల్స్ గా చేయడం అలవాటుగామారింది నెటిజన్లకు. పాపులర్ సాంగ్స్ ను రీల్స్ ద్వారా ఇంకా పాపులర్ చేసేస్తున్నారు. తాజాగా కుర్చి మడతపెట్టి సాంగ్ కూడా ఇలాలే ఇంకా పాపలర్ అయ్యి రీల్స్ పరంగా కూడా రికార్డ్ సృష్టించింది.
ఇన్ స్టాలో కుర్చీ మడతపెట్టి పాటకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకి వన్ మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ పాటకి అద్దిరిపోయే స్టెప్పులు వేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు లాంటి స్టార్స్ నటించిన ఈసినిమా మహేష్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ గా నలిచింది.