మహేష్ బాబుకు పెరిగిన ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 4 మిలియన్లు క్రాస్ చేసిన మహేష్ ఫాలోవర్స్ ట్విటర్లోనే ఈ నంబర్, ఇతరత్రా మహేష్ కు ఫుల్ ఫాలోయింగ్

సినీ తారలకు అభిమానులు ఏ రేంజ్ లో వుంటారో తెలిసిందే. అయితే సూపర్ స్టార్స్ గా వున్న వారికి లక్షల్లో, కోట్లల్లో ఫాలోయింగ్ వుంటుంది. దక్షిణాది లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో లెక్కకు మించి అభిమానాన్ని సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. తెలుగు హీరోల్లోనూ లక్షల మంది ఫాలోవర్స్ వున్న హీరోలున్నారు. అయితే సోషల్ మీడియాకి వచ్చేసరికి లెక్కలు వేరు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలకు హ్యాజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నా... సోషల్ మీడియాలోకకి వచ్చే సరికి లెక్కలు వేరుగా వుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్యను బట్టి కూడా స్టార్స్ తమ అభిమానుల సంఖ్యలో సత్తా చాటుతున్నారు. అయితే తెలుగు హీరోల్లో ట్విటర్ ఫాలోవర్స్ అత్యధికంగా వున్న హీరోల్లో మహేష్ బాబు ముందున్నాడు. 

దక్షిణాది హీరోలను తీసుకుంటే.. ప్రస్థుతం ధనుష్ అత్యధికంగా 5.7 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినికాంత్ 4.18 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ధనుష్, రజినిల తర్వాత మహేష్ 4 మిలియన్ ఫాలోవర్స్ తో క్రేజీగా మారాడు.

రజిని తర్వాత స్థానం ఈ రకంగా సంపాదించాడు మహేష్. ఇక ప్రస్తుతం తన స్పైడర్ తో తమిళంలో కూడా తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్న మహేష్ కచ్చితంగా అక్కడ తన సినిమా ప్రభావం చూపించేస్తాడని అంటున్నారు. మురుగదాస్ అక్కడ స్టార్ డైరక్టర్ కాబట్టి కచ్చితంగా మహేష్ స్పైడర్ ఓ సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

ఇక ఈ లెక్కన చూస్తే మహేష్ తమిళ ఫాలోవర్స్ ను ఏర్పరచుకుని మొదటి స్థానంలో ఉన్న ధనుష్ ను కూడా బీట్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పొచ్చు. మొత్తానికి మహేష్ ఈ రకంగా కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.