Asianet News TeluguAsianet News Telugu

రిలీజైన పదేళ్ళకు రీమేక్,ఇంతకాలం ఆపిందెవరంటే...

మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి పూర్తి స్దాయి కామెడీ సినిమా. ఫ్యామిలీతో ఒకటికి నాలుగు సార్లు జనం చూసిన సినిమా. ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోయే సినిమా. ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సీనియర్ స్టార్ హీరోతో చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు దాదాపు పదేళ్ల క్రితం నటించిన ‘దూకుడు’ చిత్రంను ఇప్పుడు రీమేక్ చేయటం అనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది.  

Mahesh Babu  dookudu to be remade in Hindi
Author
Hyderabad, First Published Aug 10, 2020, 2:13 PM IST

హిట్ సినిమాలను రీమేక్ చేయటం కొత్త విషయం ఏమి కాదు కానీ, మరీ రిలీజైన పదేళ్లకు రీమేక్ ప్రయత్నించటమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందులోనూ అది మామూలు సాదాసీదా సినిమా కూడా కాదు. తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ పొందిన సినిమా. ఆ సినిమా ఇన్నేళ్లు రీమేక్ కాకపోవటమే ఆశ్చర్యం. ఆ సినిమా మరేదో కాదు దూకుడు. మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి పూర్తి స్దాయి కామెడీ సినిమా. ఫ్యామిలీతో ఒకటికి నాలుగు సార్లు జనం చూసిన సినిమా. ఇప్పటికీ టీవీల్లో వస్తే టీఆర్పీలు అదిరిపోయే సినిమా. ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సీనియర్ స్టార్ హీరోతో చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు దాదాపు పదేళ్ల క్రితం నటించిన ‘దూకుడు’ చిత్రంను ఇప్పుడు రీమేక్ చేయటం అనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ లేటుకు కారణం...సల్మాన్ ఖాన్ అంటున్నారు.

మొదట్లో ఈ సినిమాని సల్మాన్ చేయాలని ఉత్సాహం చూపించారు. ఆయన మహేష్ బాబు పోకిరి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత రెడీ సినిమాని హిందీలో చేసారు. కానీ దూకుడు దగ్గరకు వచ్చేసరికి అంత అవుట్ అండ్ అవుట్ కామెడీలో యాక్షన్ తక్కువ ఉందని వెనక్కి తగ్గారట. అయితే అంత పెద్ద హిట్ రీమేక్ వదులుకోవటం ఇష్టం లేక, ఏమన్నా చేర్పులు మార్పులు చేయిద్దామని, తన రైటర్స్ కు ఇచ్చి ట్రై చేసారుట. అయితే ఆ వెర్షన్స్ ఏమీ ఆయనకు నచ్చలేదట. అలా ఆ సినిమా ఆయనా చేయక, సల్మాన్ దాటి అడిగే సాహసమూ ఎవరికీ లేక మిగిలిపోయిందిట. కానీ ఇన్నాళ్లకు ఈ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ను హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ రీమేక్ చేసింది. 

ఇప్పటికే రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుత  కాలానికి తగినట్లుగా స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. బీహార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగుతుందంటున్నారు. ఈ రీమేక్ లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ ను నటింపజేసేందుకు ఈరోస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దూకుడు సినిమా సబ్జెక్ట్ యూనివర్శిల్ గా ఉంటుంది. ఎక్కడైనా ఎంటర్ టైన్మెంట్ చేస్తుందనే నమ్మకంతో చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ స్దాయి కామెడీని హిందీలో డీల్ చేసే ఈ తరం దర్శకుడు ఎవరు అనేది పెద్ద ప్రశ్న. 
 

Follow Us:
Download App:
  • android
  • ios