Asianet News TeluguAsianet News Telugu

#Animal మహేష్,రాజమౌళిలకు నచ్చలేదా?

'యానిమల్' తాలూకు ఫస్టు టీజర్ చూడగానే .. ఈ సినిమాను తప్పకుండా చూడాలని అనుకున్నాను. టీజర్ నాకు అంతగా నచ్చింది. 

Mahesh Babu and Rajamouli didnot like the Animal movie? jsp
Author
First Published Dec 4, 2023, 12:55 PM IST


బిజినెస్ లావాదేవీల్లో పడి ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోని తండ్రి, అయినా ఆయనను అతిగా ప్రేమించే ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ యానిమల్. అయినా ఆ తండ్రి కోసం ఆ కొడుకు ఏం చేయడానికైనా వెనుకాడడు. అతనిలో ఒక క్రిమినల్ ఉండటం వల్లనే అలాంటి పనులు చేయడం సాధ్యమవుతోందనే అభిప్రాయాన్ని తండ్రి వ్యక్తం చేస్తుంటాడు. ఇక్కడే ఇద్దరికీ వాదన జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్దితుల్లో తండ్రి పై ఎటాక్ చేస్తే ఆ కొడుకు ఎలా రియాక్ట్ అయ్యాడనే విషయం చుట్టూ తిరిగే ఎమోషనల్ క్రైమ్ డ్రామా ఇది. ఈ సినిమాకు ఓ రేంజిలో కలక్షన్స్ దేశ వ్యాప్తంగా వస్తున్నాయి. 

అంతేకాదు ఈ సినిమా గురించి సామాన్యులే కాకుండా సినిమా సెలబ్రెటీలు సైతం మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఏకంగా రామ్ గోపాల్ వర్మ నాలుగు పేజీల పెద్ద లవ్ లెటర్ లాంటి రివ్యూ ఇచ్చారు. ఈక్రమంలో అందరూ మహేష్ బాబు,రాజమౌళిలు ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తారని భావించారు. అయితే ఇప్పటిదాకా వాళ్ల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాళ్లు చూడకుండా ఉండరే. అయినా ఎందుకు మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో సినీ అభిమానులు డిస్కషన్స్ పెడుతున్నారు. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ...మహేశ్ బాబు మాట్లాడుతూ .. " మీరందరూ ఇంతగా వచ్చి ఈ సినిమాను సపోర్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సందీప్ అంటే నాకు చాలా ఇష్టం .. అతని సినిమాలన్నా ఇష్టం. మొన్ననే ట్రైలర్ చూశాను .. మెంటల్ వచ్చేసింది అంతే. నేనెప్పుడూ ఇలా చెప్పను .. కానీ ఈ ట్రైలర్ చూసి అలా ఫీలయ్యాను. ఇలాంటి ఒరిజినల్ ట్రైలర్ ఇంతవరకూ నేనైతే చూడలేదు" అన్నారు. 
 
రాజమౌళి మాట్లాడుతూ .. "ఇక్కడి ఆడియన్స్ ఎలా ఉంటారో .. వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో బాలీవుడ్ వారికి చూపించాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది .. అది ఇప్పుడు తీరింది. మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అన్నారు.  "ప్రతి ఏడాది కొత్త దర్శకులు వస్తారు .. సూపర్ హిట్ సినిమాలు  తీస్తారు .. ఎంతో పేరు తెచ్చుకుంటారు. ఒకే ఒక్క సినిమాతో ... సినిమా అంటే ఇలాగే తీయాలనే ఫార్ములాను షేక్ చేసిన డైరెక్టర్స్ మాత్రం అరుదుగా వస్తుంటారు. అలా మన తరంలో వచ్చిన దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ అయితే, ఆ తరువాత .. నేను ఇలాగే సినిమా తీస్తాను అంటూ వచ్చిన డైరెక్టర్ మరొకరు సందీప్ రెడ్డి వంగా" అని అన్నారు.  'యానిమల్' తాలూకు ఫస్టు టీజర్ చూడగానే .. ఈ సినిమాను తప్పకుండా చూడాలని అనుకున్నాను. టీజర్ నాకు అంతగా నచ్చింది. బాలీవుడ్ లో నా ఫేవరేట్ హీరో ఎవరని చాలామంది చాలా సార్లు అడిగారు. అందరికీ నేను చెప్పింది ఒకటే మాట. నా ఫేవరేట్ హీరో రణ్ బీర్ కపూర్.  " అని చెప్పారు. 

అంతలా ఈ సినిమా గురించి పొగిడిన వీళ్ళిద్దరూ సినిమా రిలీజ్ తర్వాత సైలెంట్ అవ్వటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.రణ్ బీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన 'యానిమల్' సినిమా, డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది.   

Follow Us:
Download App:
  • android
  • ios