మహేష్ తో  తమ బ్యానర్ లో  ఓ సినిమా చేయించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చాలా కాలంగా ఉత్సాహం చూపెడుతున్నారు. మెగా హీరోలతో పాటు బయిట హీరోలతో కూడా సినిమాలు చేస్తే బ్యానర్ కు ఉండే విలువ వేరు. అందుకే ఆయన గీత గోవిందం చిత్రాన్ని తమ క్యాంప్ హీరోలతో కాకుండా విజయ్ దేవరకొండ తో చేసారు. అలాగే ఇప్పుడు అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు.

మహేష్ తోనూ ఓ సినిమా చేస్తే కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా బ్యానర్ గుర్తింపు వేరుగా ఉంటుందని ఆ మధ్యన నమ్రతను కలిసి మాట్లాడారు. మహేష్ తో సినిమాకు సరే అనిపించుకున్నారు. టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసారట.తన ఆస్దాన డైరక్టర్ గా మారిన గీత గోవిదం దర్శకుడు పరుశరామ్ తో ఓ కథ సైతం రెడీ చేయించారు. ‘గీత గోవిందం’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్న పరశురామ్‌... ఇటీవలే మహేష్‌కి స్టోరీలైన్   వినిపించినట్టు తెలిసింది. మహర్షి ప్రమోషన్ హడావిడిలో ఉన్న మహేష్ పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేయమన్నట్టు సమాచారం.

అన్నీ కుదిరితే అనిల్‌ రావిపూడితో సినిమా పూర్తయ్యాక, పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటించే అవకాశాలు  కనిపిస్తున్నాయంటున్నారు. అయితే గీతా ఆర్ట్స్ లో మాత్రం ఈ సినిమా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. వేరే  బ్యాన‌ర్‌లో ఈ సినిమా ఉంటుంద‌ని, మాగ్జిమం మైత్రీ మూవీస్ ఈ సినిమాని టేక‌ప్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వినపడుతోంది. మరో ప్రక్క.., మహేష్ త‌న సొంత సంస్థ‌లోనూ ఈ సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని తెలుస్తోంది. 

అయితే  ఇటు ప‌ర‌శురామ్‌కీ, అటు మ‌హేష్‌కీ అడ్వాన్సులు ఇచ్చేసిన గీతా ఆర్ట్స్ ఈ సినిమాని ఎందుకు ప్రొడ్యూస్ చేయటం లేదని ఎవరికి తెలియటం లేదు.  వేరే ఏదన్నా పెద్ద ప్రాజెక్టు పనిలో ఉండి దీన్ని చేయటం కష్టమని అరవింద్ భావిస్తున్నారా..ఏదైమైనా అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియ్ల ఎనౌన్సమెంట్  వ‌స్తోంది. అప్పుడు  క్లారిటీ రావచ్చు.