తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. స్టార్ హీరో మహేష్ బాబు 

తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. స్టార్ హీరో మహేష్ బాబు మాత్రం సోషల్ మీడియాకు చాలా దూరం. అటువంటి వీరిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మహేష్ బాబు రాజకీయనాయకులతో పెద్దగా కలిసి ఉన్న దాఖలాలు లేవు కానీ కేటీఆర్ తో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు. రీసెంట్ గా మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమా బాగుందని మహేష్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు కేటీఆర్.ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన కేటీఆర్ అక్కడున్న యూత్ తో కలిసి ఓ ఫోటో తీసుకున్నారు. 

ఆ సెల్ఫీను సోషల్ మీడియాలో పంచుకున్న ఓ యువకుడు ''ఇది నిజం.. కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు'' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్ చేసిన కేటీఆర్.. మహేష్ ను ట్యాగ్ చేస్తూ 'మహేష్ ఇది నీకోసమే' అంటూ కామెంట్ పెట్టారు. దీనికి రిప్లై చేస్తూ మహేష్ నవ్వుతున్న ఓ ఎమోజీను పెట్టాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ట్వీట్ల సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Scroll to load tweet…

Scroll to load tweet…