Asianet News TeluguAsianet News Telugu

మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్...  కళాతపస్వి మృతిపై సంతాపం ప్రకటించిన చిత్ర పరిశ్రమ!


లెజెండ్స్ నిష్క్రమణం కూడా సెలబ్రేషనే. కళాతపస్వి విశ్వనాథ్ మృతి వార్త తెలిసిన పరిశ్రమ ఆయన కీర్తిని గుర్తు చేసుకుంటుంది. సంతాపం తెలుపుతూ గౌరవం ప్రకటిస్తున్నారు. 
 

mahesh allu arjun ram charan and other extends their condolences to k viswanath
Author
First Published Feb 3, 2023, 1:46 PM IST

హీరో రామ్ చరణ్ దర్శకులు విశ్వనాథ్ మృతిపై స్పందించారు. ఓ లెజెండ్ ని కోల్పోయాము. మీకు మరణం లేదు. మా జ్ఞాపకాల్లో బ్రతికే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. 

సినిమా మేకింగ్ లో మాస్టర్. నా ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఇకలేరు. మీరు దూరమైన మీరు తెరకెక్కించిన కళాఖండాలు మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాయని... తన స్పందన తెలిపారు. 

సినిమాకు సంస్కృతిని పరిచయం చేసిన మేధావి. భారతదేశం గర్వించదగ్గ దర్శకులు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. అని మహేష్ ట్వీట్ చేశారు. 

అయన మరణం మాటల్లో చెప్పలేనంత లోటు అని కళ్యాణ్ రామ్ అభివర్ణించారు. వసూళ్లకు, స్టార్స్ కి , ప్రతి వ్యక్తికీ సినిమా అనేది అతీతమైనది నిరూపించిన దర్శకుడు ఆయన. మీ ఋణం తీర్చుకోలేమంటూ నాని కామెంట్ చేశారు. 

లెజెండ్స్ కి మరణం లేదు. మీ సినిమాల జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నా బాల్యం పై ఆయన సినిమాల ప్రభావం ఎంతగానో ఉందని, మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు.  మోహన్ బాబు విశ్వనాథ్ గారి మృతికి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

విశ్వనాథ్ గారి మృతి కేవలం తెలుగు సినిమాకు కాదు ఇండియన్ ఇండస్ట్రీకే లాస్. ఆయన మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వెంకటేష్ ట్వీట్ చేశారు. 

మరొక లెజెండ్ మనల్ని వదిలిపోయారు. విశ్వనాథ్ గారు తన చిత్రాలతో ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు. ఆయన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచిపోయారు. పవన్ కళ్యాణ్ విశ్వనాథ్ మృతిపై లెటర్ హెడ్ విడుదల చేశారు. విశ్వనాథ్ గారి లెగసీనీ ఆయన గుర్తు చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios