శ్రీలీల పూజా హెగ్డే (Pooja Hegde)చెల్లిగా కనిపించనున్నారట. అయితే శ్రీలీల పాత్రకు నిడివి చాలా తక్కువ ఉంటుందట. అలాగే మహేష్ తో ఒక్క పాట కూడా లేదట. దీంతో శ్రీలీల మహేష్ మూవీ తిరస్కరించే ఆలోచనలో ఉన్నారట.
గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే లక్ చాలా అవసరం. ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేసినా కొందరికి ఒక్క అవకాశం కూడా తలుపుట్టదు. కానీ కొందరికి వద్దంటే ఆఫర్స్ వచ్చిపడతాయి. కన్నడ భామ శ్రీలీల (Sreeleela)టాలీవుడ్ హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు. ఆమె లేటెస్ట్ రిలీజ్ పెళ్ళిసందD పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా శ్రీలీల గ్లామర్ సినిమాకు హైలెట్ . కమర్షియల్ గా పెళ్లిసందD ఏమంత పెద్ద హిట్ కాదు. అయినప్పటికీ శ్రీలీలకు టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే రవితేజ (Raviteja)ధమాకా మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మరో మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ కి ఆమె సైన్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ 28వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ శ్రీలీల దక్కించుకున్నారు. పూజా హెగ్డే మెయిన్ లీడ్ చేస్తున్నారు.
శ్రీలీల పూజా హెగ్డే (Pooja Hegde)చెల్లిగా కనిపించనున్నారట. అయితే శ్రీలీల పాత్రకు నిడివి చాలా తక్కువ ఉంటుందట. అలాగే మహేష్ తో ఒక్క పాట కూడా లేదట. దీంతో శ్రీలీల మహేష్ మూవీ తిరస్కరించే ఆలోచనలో ఉన్నారట. అయితే శ్రీలీలను వదులుకోవడానికి ఇష్టపడని త్రివిక్రమ్ (Trivikram)ఆమె పాత్ర తీరునే మార్చివేశారట. శ్రీలీల పాత్ర నిడివి పెంచడంతో పాటు ఆమెకు మహేష్ తో ఓ సాంగ్ కూడా స్క్రిప్ట్ లో పొందుపరిచాడట. దానితో శ్రీలీల మహేష్ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారట.
అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పూజా హెగ్డే చెల్లెలిగా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకు త్రివిక్రమ్ ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారు. అల వైకుంఠపురంలో నివేదా పేతురాజ్ పాత్రకు కూడా ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. పేరుకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశామే అయినా సదరు హీరోయిన్స్ కెరీర్ కి అవి ఏమాత్రం ఉపయోగపడలేదు. వయసులో చిన్నదైనా శ్రీలీల మహేష్ మూవీ అనగానే టెంప్ట్ కాకుండా, తన పాత్రలో మార్పులు చేయించి ఎంతో కొంత ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది.
అదే సమయంలో మహేష్ (Mahesh babu)సినిమాలో ఆఫర్ అంటే ఎలాంటి కండీషన్స్ పెట్టకుండా ఒప్పుకునే హీరోయిన్స్ అనేక మంది ఉన్నారు. త్రివిక్రమ్ వాళ్లందరినీ కాదని కండీషన్స్ కి ఒప్పుకొని మరీ శ్రీలీలను తీసుకున్నారు. శ్రీలీలకు త్రివిక్రమ్ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే ఆమె గ్లామర్ కి ఆయన కూడా ఫిదా అయినట్లు అర్థమవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
