సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం 'మహర్షి'. త్వరలో  విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. ఓ ప్రక్క పాటలు, మరో ప్రక్క కొత్త కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఆ ఎక్సపెక్టేషన్స్ ని తారా స్దాయికి చేర్చేందుకు కానూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్దాయిలో ప్లాన్ చేసారు.

అభిమానులంతా ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్.... హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా లో మే 1వ తేదీన  నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన, ప్రీ రిలీజ్ ఈవెంట్ పరంగా కు భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తారని భావిస్తున్నారు. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి ముందు మహేశ్ బాబు చేసిన 24 సినిమాలకి సంబంధించిన దర్శకులు ఆయన గురించి తమ మనసులో మాటను చెప్పే వీడియోను ఈ వేదికపై ప్లే చేస్తారట. అలాగే ఆ 24 మంది దర్శకులను కూడా ఈ వేడుకకు పిలిచి సన్మానం చేస్తారట. 

ఇక ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే విషయం కూడా తెలియాల్సి వుంది. మహేష్ బాబు తండ్రి  సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక అతిధి అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ చిత్రంను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - అశ్వినీదత్ - పీవీపీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.