సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మినిమమ్ రికార్డులు బద్దలవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మహర్షి సినిమా కూడా పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ లు బద్దలు కొట్టింది. అయితే అంతా బాగానే ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం మహర్షి వెనుకబడిపోయాడు.

మహేష్ గత చిత్రాలతో పోలిస్తే మహర్షి సినిమా ఉహించినంతగా డాలర్స్ ను రాబట్టలేకపోయింది. వన్ మిలియన్ డాలర్స్ ను అందుకోవడానికి మహర్షికి మూడు రోజుల సమయం పట్టింది. ఖైదీ నెంబర్ 150 - భరత్ అనే నేను - స్పైడర్ సినిమాల కంటే కూడా మహర్షికి తక్కువ కలెక్షన్స్ రావడం గమనార్హం. ఇక టోటల్ గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు - అశ్విని దత్ - పివిపి సంయుక్తంగా .నిర్మించారు. మంచి సోషల్ మెస్సేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లో మంచి లాభాలను అందించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.