సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నడూ లేనంత జోష్ ఆయనలో కనిపిస్తోంది. దానికి కారణం 'మహర్షి'. ఓ క్లాసిక్ సినిమా చేశామంటూ సంబరపడిపోతున్నారు. ఇప్పటివరకు మహేష్ ఏ సినిమాకు చేయనంత పబ్లిసిటీ ఈ సినిమాకు చేశాడు.

సినిమా విడుదలైన రోజు రాత్రే పెద్ద పార్టీ చేసుకొని విజయ్ దేవరకొండని పిలిచి హడావిడి చేసి ఆ ఫోటోలు బయటకి వదిలారు. అలానే సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఇందులో మహేష్ చేసిన హడావిడి మాములుగా లేదనే చెప్పాలి. కాలర్ ఎగరేసి మరీ సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు.

ఇక దర్శకుడికి ముద్దులు, ఫ్యామిలీ ఫోటోలు అంటూ వార్తల్లో ఉండేలా చూసుకున్నాడు. ఇప్పుడు మరిన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి సినిమా థియేటర్లను టచ్ చేయడం.. మహేష్ స్వయంగా ఒకట్రెండు థియేటర్లను విజిట్ చేయబోతున్నాడని సమాచారం. మహేష్ లాంటి స్టార్ హీరోలు థియేటర్ కి వెళ్లి విజిట్ చేయడమనేది చాలా అరుదుగా జరుగుతుంది.

బుధవారం నాడు ఒకటి లేదా రెండు థియేటర్లకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత రైతులతో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. ఇందులో దర్శకుడు, హీరో పాల్గొనబోతున్నారు. అలానే ఈ నెల 18న విజయవాడలో భారీ సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ హడావిడి కారణంగా మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తుందేమో చూడాలి!