సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సినిమాలో ఒక్కో పాటను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటివరకు మూడు పాటలు విడుదలయ్యాయి. వాటిలో దేనికి సరైన ఆదరణ దక్కలేదు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పై విమర్శలు వినిపించాయి. తాజాగా 'పదరా పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా' అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం.

శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట ట్యూన్ కూడా ఎక్కడో విన్నట్లే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ అభిమానులు మాత్రం పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని శంకర్ మహదేవన్ వాయిస్ పాట స్థాయిని పెంచేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాటను మీరో ఓ సారి వినేయండి!