సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మహర్షి స్పెషల్ ఫిల్మ్ కానుందని సినిమా హడావుడి చుస్తే అర్ధమవుతోంది. ప్రమోషన్స్ సంగతి పక్కనపెడితే సినిమాకు సంబందించిన బిజినెస్ అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఫైనల్ గా డిజిటిల్ ప్లాట్ ఫార్మ్ లో మహర్షి ది బెస్ట్ అనిపించుకుంది. 

మహేష్ బాబు కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా మహర్షి సినిమా 11కోట్ల ధరకు అమ్మడు పోయినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. చివరగా మహేష్ నుంచి వచ్చిన భరత్ అనే నేను సినిమా కంటే కూడా మహర్షి హై రేంజ్ లో బిజినెస్ చేస్తోంది. 

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు - అశ్విని దత్ - పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తుండడంతో స్పెషల్ ఎట్రాక్షన్ ని కలిగిస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.