Asianet News TeluguAsianet News Telugu

‘మహానటి’ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు

కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో జీవించేసింది. సాధారణ ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు సైతం ఈ చిత్రానికి దాసోహమయ్యారు. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా సత్తా చాటింది. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది.

Mahanati Wins The Indian Film Festival Of Melbourne Equality In Cinema Award
Author
Hyderabad, First Published Aug 13, 2018, 1:11 PM IST

అలనాటి అందాల తార, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. నాగ అశ్విన్ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్.. సావత్రి పాత్ర పోషించగా.. దుల్కర్ సల్మాన్ .. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో అలరించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో జీవించేసింది. సాధారణ ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు సైతం ఈ చిత్రానికి దాసోహమయ్యారు. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా సత్తా చాటింది. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది.

ఆస్ట్రేలియాలో జరిగిన ‘ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌’లో ‘మహానటి’ చిత్రానికి ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు వచ్చింది. అవార్డు గ్రహీతలు వీరే

బెస్ట్ ఇండియన్ ఫిల్మ్: లవ్ సోనియా
బెస్ట్ ఇండియన్ ఫిల్మ్(స్పెషల్ మెన్షన్): గాలి గులియాన్
ఈక్వాలిటీ ఇన్ సినిమా: మహానటి
డైవర్సిటీ అవార్డు: ఫ్రిదా పింటో
ఉత్తమ నటుడు: మనోజ్ బాజ్‌పేయి (గాలి గులియాన్)
ఉత్తమ నటి: రాణి ముఖర్జీ(హిచ్కీ)
ఉత్తమ చిత్రం: సంజు
ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ హిరానీ(సంజు)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్(సంజు), రిచా చద్దా(లవ్ సోనియా)
వాంగ్వార్డ్ అవార్డ్: రణ్‌బీర్ కపూర్(సంజు)
ఎక్సలెన్స్ ఇన్ సినిమా: రాణి ముఖర్జీ.

Follow Us:
Download App:
  • android
  • ios