ప్రస్తుతం లాక్‌ డౌన్‌ సమయంలో హీరోలంతా ఫిజిక్‌ మీద దృష్టి పెట్టారు. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టార్స్‌కు లాంగ్ బ్రేక్‌ దొరకటంతో ఫిజిక్‌ విషయంలో మార్పులకు ఉపక్రమించారు. తాజాగా మరో యంగ్ హీరో నాగ శౌర్య కూడా సిక్స్‌ ప్యాక్‌ బాడీని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల తన వర్క్‌ అవుట్‌ వీడియోతో షాక్‌ ఇచ్చిన నాగశౌర్య తాజాగా తన నెక్ట్స్ సినిమా ప్రీ లుక్‌తో వావ్‌ అనిపించాడు.

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు గా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద నిర్మిస్తున్న చిత్రం ప్రి లుక్ ను శనివారం విడుదల చేశారు. సూపర్ ఫిట్ గా వెనుకనుండి కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న నాగశౌర్య లుక్ కు మంచి రెస్సాన్స్ వస్తోంది.

దీంతో ఫస్ట్ లుక్ మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ప్రతి సినిమాలో తన స్పెషాలిటీ ని నిరూపించుకుంటూ ఛలో, ఓ బేబీ, అశ్వద్ధామ వంటి హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా #NS20 ఫస్ట్ లుక్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల జూలై 27న ఉదయం 9 గం లకు విడుదల చేయనున్నారు. ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.