లిప్ లాక్ మాత్రం పవన్ తోనే!

madhavi latha about lip lock with pawan kalyan
Highlights

హీరోయిన్ గా ఆరంభంలో మంచి అవకాశాలనే దక్కించుకుంది మాధవీలత

హీరోయిన్ గా ఆరంభంలో మంచి అవకాశాలనే దక్కించుకుంది మాధవీలత. కానీ ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించలేకపోయింది. రాజకీయాలపై ఉన్న ఆసక్తితి రీసెంట్ గా బీజేపీ పార్టీలో చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. సినిమాలు, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై మాట్లాడింది. 

''కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు అన్ని చోట్ల ఉంది. అయితే టాలీవుడ్ లో ఎక్కువగా ఉందని అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. గతంలో కొందరు స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్లు వేధింపులు ఎక్కువ అయ్యాయని ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయారు. తెలుగు సినిమాలలో హీరోయిన్లకు ప్రాధాన్యం ఇచ్చే కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏడాదికి 150 సినిమాలు వస్తే అందులో ఓ పది సినిమాలలో హీరోయిన్లకు మంచి పాత్రకు దక్కుతాయి. రంగస్థలం, మహానటి వాటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాలు చూపించి టాలీవుడ్ లో హీరోయిన్లకు మంచి రోల్స్ దక్కుతున్నాయని డబ్బా కొట్టుకుంటున్నారు'' అని వెల్లడించింది.

ఇక సినిమాలో లిప్ లాక్ సీన్లో నటించాల్సి వస్తే ఎవరితో నటిస్తారనే ప్రశ్నకు సమాధానంగా.. ''అసలు అలాంటి సీన్స్ లో మొదట నటించనని చెప్పేస్తా.. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సివస్తే మాత్రం అది పవన్ కళ్యాణ్ తోనే.. అతడు అంటే అంత అభిమానం. నేను బీజేపీలో చేరినంత మాత్రాన ఆయనపై ఇష్టం పోదు'' అని స్పష్టం చేసింది. 

loader