ఆస్కార్ విన్నర్స్ ని టాలీవుడ్ సన్మానించుకుంటుంది. ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు హాజరు కాలేదు.  

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ సినిమా వేదికపై చాటింది. ఆస్కార్ గెలిచి చరిత్ర లిఖించింది. లాస్ ఏంజెల్స్ వేదికగా మార్చి 12న జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డ్స్ అందుకున్నారు. ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇది మరో అరుదైన ఘట్టం. 

తెలుగు సినిమా కలలో కూడా ఊహించని విషయాన్ని రాజమౌళి సాకారం చేసి చూపించారు. తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని టాలీవుడ్ సత్కరించుకుంటుంది. నేడు ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుక పేరుతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ కి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. 

అయితే టాలీవుడ్ ప్రధాన విభాగాల్లో ఒకటైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)అధ్యక్షుడు మంచు విష్ణు రాలేదు. 'మా' తరపున వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి వేదిక పైకి వెళ్లారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి అభినందనలు తెలిపారు. మంచు విష్ణు ఎందుకు రాలేదో ఆయన వేదికపై తెలియజేయారు. విదేశాల్లో ఉన్న విష్ణు హాజరుకాలేకపోయారు. తన తరపున అభినందనలు చెప్పమన్నారంటూ.. మాదాల రవి ముగించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా హాజరకాలేదని సమాచారం.