Asianet News TeluguAsianet News Telugu

బ్యాన్ చేసిన టాలీవుడ్ కి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు... రివేంజ్ కోసమేనా? ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగాలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మిమ్మల్ని బ్యాన్ చేసిన టాలీవుడ్ కి అధ్యక్షుడు కావాలని పోటీకి దిగుతున్నారు... ఇది రివేంజా? లేక అచీవ్మెంట్ లాగా భావిస్తున్నారా? అని ఆలీ అడిగారు. 

maa elections prakash raj made interesting comments in a talk show
Author
Hyderabad, First Published Oct 6, 2021, 7:59 AM IST

కేవలం మరో నాలుగు రోజుల్లో మా ఎన్నికలు జరగనున్నాయి. టాలీవుడ్ ఒక విధంగా అట్టుడికిపోతోంది. ప్రధాన పోటీదారులు ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేయడం, స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చుకునే స్థాయికి చేరారు. నిన్న బ్యాలెట్ ఓట్ల విషయంలో మంచు విష్ణు ప్యానెల్ అవకతవకలకు పాల్పడుతుందని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి పిర్యాదు చేశారు. మోహన్ బాబు తన మేనేజర్ ద్వారా ఓట్ల లాబీయింగ్ కి పాల్పడుతున్నారని, గెలుపు కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Prakash raj ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ మంచు విష్ణు, నరేష్ ప్రెస్ మీట్ ద్వారా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన కుటుంబాన్ని ఎన్నికలలోకి లాగవద్దన్న మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. అదే విధంగా నరేష్ ప్రకాష్ రాజ్ పై ఆర్ధిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని, ఆయనపై కోట్లలో చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని, తెలియజేశారు. 

కాగా తెలుగు పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగాలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మిమ్మల్ని బ్యాన్ చేసిన టాలీవుడ్ కి అధ్యక్షుడు కావాలని పోటీకి దిగుతున్నారు... ఇది రివేంజా? లేక అచీవ్మెంట్ లాగా భావిస్తున్నారా? అని ఆలీ అడిగారు. ఛీ ఛీ అదేం లేదండీ... ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను, మీరు గుర్తు చేశారు అన్నారు. 

అదే సమయంలో తనను బ్యాన్ చేయడానికి కొన్ని కారణాలు వివరించారు. సెట్ లో ఓ అమ్మాయిని రాళ్లతో కొడుతున్నారని తెలిసి ఓ వ్యక్తిని అలా తోశాను, దానికి కొట్టానని కేసు పెట్టారు. ఆగడు మూవీ షూటింగ్ సమయంలో ఓ సీన్ గురించి శ్రీను వైట్లతో విభేదించాను, ఆ నెక్స్ట్ డే నన్ను  తీసేసి,సోనూ సూద్ గారిని తీసుకున్నారని, ప్రకాష్ రాజ్ తెలియజేశారు. ఇక ఇవేమి అమెరికా అధ్యక్ష ఎన్నికలు కాదని, కేవలం మా సభ్యులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. 

Also Readనా ఫ్యామిలీ పేరు తీస్తే మామూలుగా ఉండదు..ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. ప్రకాష్‌ రాజ్‌కి మంచు విష్ణు వార్నింగ్‌

 


 

Follow Us:
Download App:
  • android
  • ios