ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. మంగళవారం గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. వెన్నెలకంటి పూర్తి పేరు రాజేశ్వరప్రసాద్. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300 చిత్రాలకు 2000 పైగా వెన్నెలకంటి రాశారు.