Asianet News TeluguAsianet News Telugu

`ఓజీ` డేట్‌కి దుల్కర్‌ సల్మాన్‌ `లక్కీ భాస్కర్`.. పవన్‌ కళ్యాణ్‌ రావడం లేదా?

దుల్కర్ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న `లక్కీ భాస్కర్‌` మూవీ రిలీజ్‌ డేట్‌ని ఇచ్చారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ మూవీ రావడం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
 

lucky Bhaskar movie release date final will pawan OG postponed? arj
Author
First Published May 29, 2024, 11:20 PM IST

`మహానటి`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌. `సీతారామం` చిత్రంతో తెలుగు హీరో అయిపోయాడు. ఇప్పుడు వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన `లక్కీ భాస్కర్‌` మూవీలో హీరోగా నటిస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. `లక్కీ భాస్కర్‌`ని సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. సెప్టెంబర్‌ 27నే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఓజీ` సినిమా కూడా రాబోతుంది. చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని వెల్లడించింది యూనిట్‌. కొంత పార్ట్ షూటింగ్‌ చేయాల్సి ఉంది. పవన్‌ రాజకీయంగా ఫ్రీ అయిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. కానీ ఇంతలోనే `ఓజీ` డేట్‌కి దుల్కర్‌సల్మాన్‌ `లక్కీ భాస్కర్‌` రాబోతుండటం విశేషం. 

ఇదిప్పుడు `ఓజీ` రిలీజ్‌ ని సస్పెన్స్ లో పడేసింది. ఇంతకి `ఓజీ` వస్తుందా? వాయిదా పడుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. ఓ పెద్ద సినిమాకి పోటీగా అంటే ఎవరూ సాహసం చేయరు. దుల్కర్‌ లాంటి హీరో సాహసం చేస్తున్నారంటే అది ఆ డేట్‌ కి రావడం లేదనే అర్థం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ ని కలవరానికి గురి చేస్తుంది. పవన్‌ వస్తాడా రాడా అనేది మరింత ఆందోళన కలిగిస్తుంది. 

వెంకీ అట్లూరీ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి మెస్మరైజింగ్ విజువల్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ నూలి పనిచేస్తున్నారు. 1980- 1990 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. 

సాధారణ బ్యాంకు క్యాషియర్ లక్కీ భాస్కర్   ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శ్రమిస్తున్నారు. మరి హిట్‌ పడుతుందా అనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios