Asianet News TeluguAsianet News Telugu

శోభా శెట్టితో లవ్‌ ట్రాక్‌ నిజమేనా? టేస్టీ తేజ ఏం చెప్పాడంటే?.. ఎలిమినేషన్‌పై ఊహించని కామెంట్‌

హౌజ్‌లో ఉన్నప్పుడు తేజ.. సీరియల్‌ నటి శోభా శెట్టితో పులిహోర కలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తేజ ఓపెన్‌ అయ్యాడు. అసలు నిజం ఏంటో బయటపెట్టాడు. 

love track with shobha shetty tasty teja open up actual truth in bigg boss telugu 7 arj
Author
First Published Nov 6, 2023, 10:37 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ (Bigg Boss Telugu 7)  సీజన్‌లో తొమ్మిదో వారంలో టేస్టీ తేజ (Tasty Teja) ఎలిమినేట్‌ అయ్యాడు. ఆయన ఎలిమినేషన్‌ని ఎవ్వరూ ఊహించలేదు. అంతేకాదు హౌజ్‌లో ఫన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచే తేజని ఎలిమినేట్‌ చేయడంపై కూడా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇది సరికాదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బయటకొచ్చిన తేజ చేసిన కామెంట్లు, ఆయన చెప్పిన విషయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

love track with shobha shetty tasty teja open up actual truth in bigg boss telugu 7 arj

హౌజ్‌లో ఉన్నప్పుడు తేజ.. సీరియల్‌ నటి శోభా శెట్టితో పులిహోర కలిపిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిది లవ్‌ ట్రాక్‌ని బిగ్‌ బాస్‌ హైలైట్‌ చేశాడు. హోస్ట్ నాగార్జున సైతం వీరి లవ్‌ ట్రాక్‌పై సెటైర్లు, కామెంట్లు చేశారు. శోభా శెట్టి ఓకే అంటే తన ఒంటిపై టాటూ కూడా వేయించుకుంటానని ఛాలెంజ్‌ విసిరాడు తేజ. ఇలా ప్రతి వారం ఈ ఇద్దరి మధ్య పులిహోర ట్రాక్‌ హైలైట్‌ అవుతూ వస్తుంది. ఈ సారి హౌజ్‌లో మిగిలిన ట్రాక్‌లు పెద్దగా లేకపోవడంతో వీరిది హైలైట్‌ చేశారు. 

ఇప్పుడు ఎలిమినేట్‌ అయి బయటకొచ్చిన తేజ.. దీనిపై స్పందించారు. శోభా శెట్టి(Shobha Shetty) తో లవ్‌ ట్రాక్‌ గురించి ఓమీడియా ప్రతినిధి అడగ్గా.. అసలు నిజం చెప్పాడు. అబ్బే అదేం లేదని, జస్ట్ ఊరికే సరదా కోసం అలా మాట్లాడుకునే వాళ్లమని, అంతకు మించి లవ్వులు ఏం లేవని తెలిపారు. హౌజ్‌లో 24 గంటలు కలిసి ఉంటాం కాబట్టి, హౌజ్‌ మేట్స్ తో ఒక రిలేషన్‌ ఏర్పడుతుందని, అలా శోభా శెట్టితో మంచి బాండింగ్‌ ఏర్పడిందని, తాము మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. 

love track with shobha shetty tasty teja open up actual truth in bigg boss telugu 7 arj

శోభా.. ప్యూర్‌ హార్టెడ్‌ పర్సన్‌ అని, జెన్యూన్‌గా ఉంటుందని అందుకే మేం మంచి ఫ్రెండ్స్ అయ్యామని, అంతేకాదు లవ్వులు, గివ్వులు లేవని తెలిపారు తేజ. అయితే టాటూ విషయంలో బిగ్‌ బాస్‌, నాగార్జున అడిగినప్పుడు నిజంగానే వేయిస్తారా? సీరియస్‌గా తీసుకుంటారా? అని టెన్షన్‌ పడ్డానని, కానీ వాళ్లు వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపారు.  

సందీప్‌ని నామినేట్‌ చేయడంపై స్పందిస్తూ, సందీప్‌ అడగడం వల్లే తాను నామినేట్‌ చేశానని హౌజ్‌లో తేజ చెప్పిన నేపథ్యంలో.. తాము ఏం మాట్లాడుకున్నాం, బయట ఏం చెప్పారనేది తాను చూస్తానని, ఒకటి రెండు రోజుల్లో సందీప్‌తో కలిసి ఒక వీడియో విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పుడు దానిపై మాట్లాడితే ఎలా వెళ్తుందో తెలియదు, అందుకే మేం మాట్లాడుకుని చెబుతా అని చెప్పాడు తేజ. 

ఇక ఎలిమినేషన్‌పై స్పందిస్తూ, తాను తొమ్మిది వారాలు హౌజ్‌లో ఉంటానని అస్సలు ఊహించలేదన్నాడు తేజ. మహా అయితే నాలుగు ఉంటానని అనుకున్నాని, తొమ్మిది వారాలను ఎక్స్ పెక్ట్ చేయలేదని, తనకు ఫుల్‌ హ్యాపీ అని చెప్పారు. అయితే ఎలిమినేట్‌ అయితే 7, 9, 12 వారాల్లో అవుతానని తన సెవెన్త్ సెన్స్ చెప్పిందన్నారు. బిగ్‌ బాస్‌లోకి వెళ్లడం గొప్ప అనుభవం అని,  ఫుడ్‌ బ్లాగ్‌ చేసుకునే తాను బిగ్‌ బాస్‌లోకి వెళ్లి నాలుగు వారాలు ఉంటే అందరితో పరిచయం ఏర్పడుతుంది, ఆ తర్వాత తన బ్లాగ్‌ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని భావించాను, ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని నేను ఇన్ని వారాలు ఉండటం చాలా హ్యాపీగా ఉందని, అభిమానులకు, ఓట్‌ వేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు తేజ. 
 

Follow Us:
Download App:
  • android
  • ios