ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని లవ్ స్టోరీ టీజర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఒక నిమిషం నిడివి గల లవ్ స్టోరీ టీజర్ శేఖర్ కమ్ముల మార్క్ సన్నివేశాలతో సాగింది. ఐతే ఆయన గత చిత్రాలకు భిన్నంగా చైతూ, సాయి పల్లవి ఘాడమైన ప్రేమికులుగా కనిపిస్తారు అనిపిస్తుంది. 

కెరీర్ లో గొప్పగా ఎదగాలనుకునే యువ జంట మధ్య చిగురించిన ప్యూర్ లవ్ స్టోరీగా ఈ మూవీ కథ అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ జాబ్ వేటలో విసిగిపోయిన అమ్మాయిగా సాయి పల్లవి పాత్రే ఉండే అవకాశం కలదు. చైతూ మరియు సాయి పల్లవి లుక్స్ మిడిల్ క్లాస్ ని తలపిస్తున్నాయి. 

ఇక ప్రేమ కోసం ఎంతకైనా తెగించే యువకుల కథగా లవ్ స్టోరీ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తంగా సినిమా టీజర్ తోనే శేఖర్ కమ్ముల అంచనాలు పెంచేశాడు. శేఖర్ కమ్ముల నుండి మరో భారీ హిట్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన గత చిత్రం ఫిదా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా, సాయి పల్లవితో ఆయన చేస్తున్న లవ్ స్టోరీ కూడా అదే తరహాలో సక్సెస్ అయ్యేలా అనిపిస్తుంది.