సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ప్రేమకథలను సహజంగా తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథగా తెరకెక్కుతున్న  ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది.. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కావ్యాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు.ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్. 

అయితే అదే రోజు శివ నిర్వాణ డైరక్షన్ లో నాని హీరోగా రూపొందుతోన్న టక్ జగదీష్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది.  ఈ విషయం ఇప్పటికే నిర్మాతలు ఖరారు చేసారు. అయితే అదే రోజున నాగ చైతన్య సినిమా కూడా రిలీజ్ పెట్టుకోవటం ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు సినిమాలు మీడియం రేంజి హీరోలువి కావటం, డైరక్టర్ ఓరియెంటెడ్ పిల్మ్ లు కావటంతో పోటీ వీటి మధ్య ఖచ్చితంగా ఉంటుంది. దాంతో థియోటర్ సమస్య అయితే రాకపోవచ్చు కానీ, ప్రేక్షకుల సమస్య అయితే వస్తుంది.

 రిలీజ్ రోజు ఓపినింగ్స్ కు సమస్య వస్తుంది.  రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే సమస్యలేదు. కానీ ఏది తేడా కొట్టినా రెండో దానికి బాగా కలిసి వస్తుంది. ఆ వారం కింగ్ ఆ సినిమానే అవుతుంది. అటు ఓపినింగ్స్ దెబ్బ..ఇటు సోలో ఫెరఫెర్మాన్స్ లేకపోవటం మీడియం సినిమాలకు కలిసొచ్చే అంశం కాదు. దాంతో ట్రేడ్ లో ఈ నిర్మాతలు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సమస్య తీరుతుందని,లేకపోతే సమస్యలు కొని తెచ్చికొన్నట్లు అవుతుందంటున్నారు. 

 ఇక ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి  కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా  సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం తో ఈ  ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది.

 డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈసినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ గా అయింది.  
 
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.