#LEO నెగిటివ్ టాక్ పై లోకేష్ ఏమన్నాడంటే..

రిలీజ్ రోజు నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన లోకేష్ తాజాగా ఓ మీడియా వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపధ్యంలో లోకేష్ ని మీడియా వారు ఈ నెగిటివ్ టాక్ గురించి అడిగారు. 
 

Lokesh Kanagaraj responds to the mixed reviews of Leo jsp

దర్శకుడుగా  లోకేష్ కనగరాజ్ కు సెపరేట్ ప్యాన్ బేస్ ఉంది.  ఆయన తాజాగా   విజయ్ తో  ‘లియో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.  ఫ్లాష్ బ్యాక్ బాగోలేదంటూ చాలా చోట్ల నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ‘లియో’ కి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి.  టాక్ తేడాగా ఉన్నా ఈ మూవీ దసరాల్లో  చాలా బాగా హోల్డ్ చేసింది అని చెప్పాలి.  సినిమా రిలీజ్ రోజు నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన లోకేష్ తాజాగా ఓ మీడియా వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపధ్యంలో లోకేష్ ని మీడియా వారు ఈ నెగిటివ్ టాక్ గురించి అడిగారు. 

లోకేష్ మాట్లాడుతూ.. లియో సినిమాని జనం బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. అలాగే తాను నెట్ వర్క్ కవరేజ్ ఏరియాకు దూరంగా ఉన్నానని, మరో నాలుగైదు రోజులు వెయిట్ చేసి అప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఏమిటనేది తెలుసుకుంటానని చెప్పారు. ఆ కామెంట్స్ ని బట్టి తన తదుపరి చిత్రానికి సంభందంచి మార్పులు, చేర్పులు అవసరమైతే చేస్తానని అన్నారు. ప్రస్తుతానికి అయితే తాను రివ్యూలు గురించి తెలుసుకోలేదని చెప్పుకొచ్చారు. ప్రతీ సారి లోకేష్ అలాగే చేస్తారని తెలుస్తోంది. 

ఇక లియో ప్రీ రిలీజ్  బ్రేక్ ఈవెన్  విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 220 కోట్ల షేర్, 420 కోట్ల గ్రాస్ వసూళ్లు అని తెలుస్తోంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టాక్ కు సంభందం లేకుండా  దసరా పండుగ సీజన్‌లో  కలెక్షన్స్ తో క్యాష్ చేసుకుంటోందనే చెప్పాలి.  నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయింది. తెలుగు లో రాష్ట్రాల్లో మాత్రం నిన్నటి  రోజు కొంచం స్లో డౌన్ అయింది, అయినా కూడా  తెలుగు లో ఇప్పటి వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుందనే చెప్పాలి.   ‘లియో’కు  స్క్రీన్లు, షోలు  తగ్గించలేదు.  ఆక్యుపెన్సీ కూడా బాగుంది. ఇలాంటి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇలా కలెక్ట్ చేయటం మామూలు విషయం కాదు. 
 
 యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా అనిపించేలాగే ఉన్నా… లోకేష్ గత చిత్రాల్లో కనిపించిన ఎమోషనల్‌ కనెక్టవిటీ  ఈ సినిమాలో లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో ప్రక్క ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్‌ లో కనిపించబోతున్నారంటూ  వార్తలు వైరల్ అయ్యీయి. చిత్రయూనిట్ కూడా ఈ వార్తలను ఖండించలేదు. వచ్చే క్రేజ్ ని పోగొట్టుకోవటం ఎందుకనుకున్నారు. కానీ సినిమాలో చరణ్‌ కనిపించకపోవటంతో అభిమానులను  హర్ట్ చేసింది.   

ఇక  విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంటున్న లియో… ఆ తరువాత ఈ  జోరు ని ఏ మేరకు కొనసాగిస్తుందో చూడాలి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios