Asianet News TeluguAsianet News Telugu

త్రిషని బెడ్ రూమ్ కి ఎత్తుకెళ్ళి అంటూ లియో నటుడు వల్గర్ కామెంట్స్.. తీవ్రంగా ఖండించిన లోకేష్ కనకరాజ్ 

లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో చిత్రం కొన్ని వారాల క్రితం విడుదలై పర్వాలేదనిపించింది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి.

lokesh kanagaraj responds to mansoor ali khan comments on trisha dtr
Author
First Published Nov 19, 2023, 10:00 AM IST

లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో చిత్రం కొన్ని వారాల క్రితం విడుదలై పర్వాలేదనిపించింది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించింది. ఇద్దరూ భార్య భర్తలుగా అద్భుతంగా నటించి మెప్పించారు. 

లియో చిత్రంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆంటోని దాస్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా.. లియోకి అనుచరుడిగా మన్సూర్ నటించారు. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ రివీల్ అయ్యేది ఇతడితోనే. తాజాగా మన్సూర్ అలీ ఖాన్ త్రిషని ఉద్దేశించి తీవ్ర అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. 

లియో చిత్రంలో త్రిషని రేప్ చేసే అవకాశం రాలేదు అంటూ నిరాశ పడుతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్ లో రేప్ సీన్ ఉంటుందని భావించా. చాలా చిత్రాల్లో నేను రేప్ సన్నివేశాల్లో నటించా. నాకేమి కొత్త కాదు. త్రిషని నా చేతులతో బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ ఈ చిత్రంలో నాకు త్రిషతో అసలు సన్నివేశాలే లేవు అంటూ వెకిలి నవ్వుతో కామెంట్స్ చేశాడు. 

త్రిష ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మన్సూర్ కామెంట్స్ ని ఖండించింది. అలాంటి వ్యక్తితో నటించినందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేసింది. అంతే కాదు ఇకపై కూడా మన్సూర్ తో నటించనని తేల్చేసింది. ఈ వివాదంపై లోకేష్ కనకరాజ్ స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ పై లోకేష్ ఆగ్రహం వ్యాక్తం చేశారు. త్రిషపై మన్సూర్ చేసిన స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు నన్ను బాధించాయి ఎంతో ఆగ్రహానికి గురిచేశాయి. 

మేమంతా ఒక టీమ్ గా మంచి వాతావరణంలో పనిచేశాం. కానీ మహిళల పట్ల, తోటి కళాకారుల పట్ల గౌరవం ప్రవర్తన చర్చించాల్సిన అంశంగా ఉండకూడదు. మన్సూర్ వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని లోకేష్ కనకరాజ్ కామెంట్స్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios