Asianet News TeluguAsianet News Telugu

#LEOకి లోకేష్ షాకింగ్ రెమ్యునరేషన్, ఎంతంటే..?

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌తో నడుస్తోంది. అయితే వసూళ్ల పరంగా ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన ఈ చిత్రం...

Lokesh Kanagaraj Remuneration for Leo jsp
Author
First Published Oct 23, 2023, 1:39 PM IST | Last Updated Oct 23, 2023, 1:39 PM IST

సెన్సేషన్ సక్సెస్ అయ్యిన 'ఖైదీ’ (Kaithi), ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో వరసపెట్టి  గ్యాంగ్ స్టర్ డ్రామాలను తెరకెక్కిస్తున్నారు. ఆయన పేరు చెప్తే భాక్సాఫీస్ లు బ్రద్దలు అవుతున్నాయి.  తాజాగా  ‘లియో’ (Leo) కు దర్శకత్వం వహించారు.   విజయ్ (Vijay) హీరోగా చేసిన ఈ చిత్రం మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తోంది.  అంతెందుకు ఈ చిత్రం షూటింగ్  కూడా పూర్తి కాక ముందే ‘లియో’ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ‘లియో’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.400కోట్లను దాటినట్లు వార్తలు వచ్చాయి.

 అలాగే ‘లియో’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.120కోట్లకు కొనుగోలు చేసింది. పాన్ ఇండియాగా రూపొందుతుండటంతో అంత భారీ ధరను చెల్లించింది. శాటిలైట్ రైట్స్‌ను రూ.70కోట్లు చెల్లించి సన్ టీవీ సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్‌ను సోనీ మ్యూజిక్ రూ.18కోట్లకు దక్కించుకుంది. హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ కోసం సోనీ మ్యాక్స్, గోల్డ్‌మైన్స్ పోటీపడ్డాయి. ఈ హక్కుల కోసం రూ.30కోట్లను చెల్లించేందుకు ఆ సంస్థలు ముందుకు వచ్చాయి. నాన్ థియేట్రీకల్ రైట్స్ ద్వారా ‘లియో’ దాదాపుగా రూ.240కోట్ల బిజినెస్ చేసింది. మరి ఈ స్దాయి దర్శకుడు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారనేది ఎప్పుడూ ఆసక్తికరమే. 

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు లియో చిత్రం నిమిత్తం లోకేష్ కు యాభై కోట్లు రెమ్యునరేషన్ గా ముట్టింది. ఇది అతి కొద్ది సినిమాలు మాత్రమే చేసిన దర్శకుడుకి చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి. లోకేశ్ చివరి చిత్రం ‘విక్రమ్’ సంచలన విజయం సాధించడం తో ఆయనతో సినిమా చేయటానికి నిర్మాతలు క్యూలు కట్టారు. అందుకే లియో థియేట్రీకల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.  ‘లియో’ కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ) నేపథ్యంలో రూపొందింది. ఎల్‌సీయూలో ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలు ఇప్పటికే ఉన్నాయి. ‘లియో’ లో త్రిష హీరోయిన్‌గా నటించారు. ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల అయ్యింది
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios