హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రమాదం నుండి బారిన పడ్డారు. ఆమె పాల్గొంటున్న మూవీ షూటింగ్ సెట్స్ పై స్థానికులు దాడి చేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రకుల్, జాన్‌ అబ్రహాం హీరో హీరోయిన్లుగా 'అటాక్‌' పేరుతో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ షెడ్యూల్‌ ఉత్తర ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో ప్లాన్ చేశారు. ధనిపూర్ లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా డమ్మీ బాంబ్‌ బ్లాస్టింగ్‌ జరిపారు. పేలుడు కారణంగా ఏర్పడిన శబ్ధానికి స్థానికులు కంగారు పడ్డారు. ఆ బ్లాస్ట్ షూటింగ్ కోసం అని తెలుసుకొని జనాలు అటాక్ సెట్స్ దగ్గర గుమిగూడడం జరిగింది. 

షూటింగ్ కి ఇబ్బంది కలిగిస్తున్న స్థానికులను సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకోవడంతో వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారు. మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ సెట్స్ పై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సెట్స్ లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గాయాలపాలయ్యారట. సంఘటన తీవ్రత నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇవ్వగా, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారట. నటీనటులు, సాంకేతిక సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. 

ఇక రకుల్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న మే డే మూవీలో కూడా రకుల్ నటిస్తున్నారు. ఇక అటాక్ ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుంది. ఇక తెలుగులో రకుల్ నటించిన చెక్ మూవీ విడుదలకు సిద్ధమైంది. నితిన్ హీరోగా దర్శకుడు చంద్రశేకర్ ఏలేటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. చెక్ మూవీలో రకుల్ లాయర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.