Asianet News TeluguAsianet News Telugu

లియో ట్రైలర్ ఎఫెక్ట్... థియేటర్ నాశనం చేసిన విజయ్ ఫ్యాన్స్!

స్టార్ హీరోల ఫ్యాన్స్ పిచ్చి చేష్టలకు థియేటర్స్ యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ చెన్నైలో ఓ థియేటర్ ని నాశనం చేశారు. 
 

leo trailer effect hero vijay fans destroys theater in chennai ksr
Author
First Published Oct 6, 2023, 9:21 AM IST | Last Updated Oct 6, 2023, 9:21 AM IST

థియేటర్స్ మీద స్టార్ హీరోల అభిమానుల దాడులు సర్వసాధారణం అయ్యాయి. సౌత్ ఇండియాలో ఈ బ్యాడ్ కల్చర్ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పదుల సంఖ్యలో థియేటర్స్ నాశనం చేశారు. ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఉత్సాహంతో థియేటర్స్ లో క్రాకర్స్ కాల్చడం, స్క్రీన్ చించేయడం, కుర్చీలు విరగొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. 

తాజాగా విజయ్ ఫ్యాన్స్ చెన్నైలో రోహిణి థియేటర్ ని సర్వనాశనం చేశారు. స్టార్ హీరోల చిత్రాల ట్రైలర్స్ థియేటర్స్ లో ప్రదర్శించడం కొత్త ట్రెండ్. అక్టోబర్ 5న విజయ్ కొత్త మూవీ లియో ట్రైలర్ సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలు థియేటర్స్ లో లియో ట్రైలర్ ప్రదర్శనలు వేశారు. చెన్నైలోని రోహిణి థియేటర్ యాజమాన్యం కూడా లియో ట్రైలర్ ప్రదర్శనకు వేదికైంది. 

పరిమితికి మించి విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆయన పార్టీ విజయ్ మక్కల్ ఇయక్కం కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. ఒక్కసారిగా థియేటర్లోకి దూసుకెళ్లారు. కుర్చీలపై ఎక్కి ఇష్టం వచ్చినట్లు ఎగిరారు. విజయ్ ఫ్యాన్స్ దెబ్బకు థియేటర్ ఫర్నిచర్ మొత్తం పాడైపోయింది. దాదాపు అన్ని చైర్స్ రిపేర్ చేసినా సెట్ అయ్యే స్థాయిలో దెబ్బతిన్నాయి. మొదట రోహిణి థియేటర్ యాజమాన్యం బయట స్క్రీనింగ్ చేయాలని ప్లాన్ చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో థియేటర్లో లియో ట్రైలర్ ప్రదర్శించారు. 

విజయ్ ఫ్యాన్స్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక లియో దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. విజయ్ కి జంటగా త్రిష నటించింది. అర్జున్, సంజయ్ దత్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. లియో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios