డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు గాయాలు, ఫ్యాన్స్ కారణంగా రిస్క్ లో పడ్డ లియో దర్శకుడు
అభిమానుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈమధ్య వారి వల్లే సోషల్ మీడియాకు గుడ్ బై చెపుతానని ప్రకటించిన లోకేష్.. తాజాగా అదే ఫ్యాన్స్ కారణంగా రిస్క్ లో పడ్డాడు. గాయాల పాలు అయ్యాడు.
అభిమానుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈమధ్య వారి వల్లే సోషల్ మీడియాకు గుడ్ బై చెపుతానని ప్రకటించిన లోకేష్.. తాజాగా అదే ఫ్యాన్స్ కారణంగా రిస్క్ లో పడ్డాడు. గాయాల పాలు అయ్యాడు.
తమిళనాట హవా చూపిస్తున్న దర్శకులలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు లోకేష్. తన సినిమాలతో హీరోలతో సమానంగా ఆడియన్స్ లో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ దళపతితో లియో సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో.. సూపర్ హిట్ కొట్టాడు. లోకేష్ ప్లానింగ్.. కథ, స్క్రీన్ ప్లే ఇలా అన్నింటిలో జాగ్రత్తగా అడుగులు వేసి.. తెలుగు, హిందీ, ఇతర భాషల్లో పెద్ద మార్కెట్ అయ్యేలా చేశాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ అందుకున్నప్పటికీ.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోది.
ఇది ఇలా ఉంటే అభిమానులు వల్ల తిప్పలు తప్పడం లేదు లోకేష్ కు. ఆమధ్య అభిమానుల మధ్య గొడవలు.. తనను ట్యాగ్ చేస్తూ.. బూతులుతిట్టుకోవడం.. వేలల్లో ఇలాంటి మెసేజు రావడంతో.. తన సోషల్ మీడియా అకౌంట్ కు గుడ్ బై చెపుతా అన్నాడు లోకేష్. ఇక తాజాగా లోకేష్ కనగరాజ్ అభిమానుల వల్ల ఏకంగా గాయాలు పాలయ్యాడు. లియో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ వరుసగా పర్యటనలు చేస్తున్నాడు. ఈసినిమాకుబూస్ట్ ఇస్తూ.. పలు ప్రాంతాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నాడు.
ఈక్రమంలోనే తాజాగా కేరళలోని పాలక్కాడ్ లో పర్యటించాడు క లోకేష్ కనగరాజ్. డైరెక్టర్ అయినా సరే.. ఆయన క్రేజ్ మామూలుగా లేదు.. లోకేష్ ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.ఇక ఈ జన సమూహం మధ్యలో లోకేష్ చిక్కుకొని గాయాలు పాలయ్యాడు. ఈ విషయాన్ని లోకేష్ తన సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేశాడు. చిన్న గాయం అయ్యినట్లు వెల్లడించాడు. అయితే ఆయన ఇది వెల్లడించడానికి కారణం ఉంది. గాయాలు అవ్వడం వల్ల మిగిలిన రెండు ప్రెస్ మీట్లకు తాను రాలేకపోతున్నాను అని ఆయన తెలియజేశారు.
కేరళకి త్వరలోనే మళ్ళీ వస్తానని, అప్పటివరకు లియో మూవీ చూస్తూ ఎంజాయ్ చేయండి, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు చాలా థాంక్యూ, లవ్ యూ.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టు చూసిన ఆడియన్స్ జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లియో కలెక్షన్స్ విషయానికి వస్తే.. నాలుగు రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. తెలుగులో కూడా ఈ సినిమా ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం.