బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఆదివారం ఎపిసోడ్ లో యాంకర్ లాస్య ఎలిమినేట్ కావడం జరిగింది. నేడు సోమవారం కావడంతో వచ్చే వారం ఎలిమినేషన్స్ కొరకు నామినేషన్స్ మొదలయ్యాయి.  సాయంత్రం ప్రసారం కానున్న ఎపిసోడ్ ద్వారా ఈ వారం ఎలిమినేషన్స్ కొరకు ఎవరు నామినేట్ అయ్యారనేది తెలియనుంది. ఐతే బిగ్ బాస్ షో లోని కొన్ని కీలక విషయాలు ముందుగానే లీక్ అవుతున్నాయి. 

బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్స్ లో నలుగురు ఉన్నారట. అఖిల్, మోనాల్, అవినాష్ మరియు ఆరియానా ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్నారట. బిగ్ బాస్ నిర్వహించిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఈ నలుగురు నామినేటైనట్లు సమాచారం అందుతుంది. హౌస్ లో స్ట్రాంగ్ కాంటెస్టేట్స్ గా ఉన్న ఈ నలుగురు నామిటైన పక్షంలో వచ్చే వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారనుంది. 

లాస్య ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. సోహైల్, ఆరియానా, అభిజిత్, అఖిల్, అవినాష్, హారిక మరియు మోనాల్ హౌస్ లో ఉన్నారు.