Asianet News TeluguAsianet News Telugu

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చిత్ర లోగోను ఆవిష్కరించిన ద‌ర్శకుడు నాగ్ అశ్విన్‌.. ‘జాతి రత్నాలు’ దర్శకుడికి ప్రశంసలు

జాతీయ‌ స్థాయిలో ప‌లు అవార్దులు పొంది తెలుగులో గ‌ర్వించే సినీ నిర్మాణ సంస్థగా పేరుపొందింది ‘పూర్ణోదయ మూవీ క్రియేషన్స్’. మళ్లీ ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ చిత్ర లోగోను తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు.
 

Leading director Nag Ashwin unveiled the logo of the film First Day First Show, Interesting Details
Author
Hyderabad, First Published May 16, 2022, 5:49 PM IST

జాతీయ‌స్థాయిలో ప‌లు అవార్దులు పొంది తెలుగులో గ‌ర్వించే సినీ నిర్మాణ సంస్థగా పేరుపొందిన‌ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా మారి శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో తొలి చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు.  శ్రీ‌జ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` (First Day First Show) అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ చిత్ర లోగోను సోమ‌వారం ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రముఖ ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగ్ ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

తెలుగులో ‘జాతిరత్నాలు’ సినిమాతో పాపులర్ అయ్యాడు దర్శకుడు ‘అనుదీప్’ (Anudeep). ఆయన శిష్యులు వంశీ, ల‌క్ష్మీనారాయ‌ణ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రంతో ద‌ర్శకులుగా ప‌రిచ‌యం అవుతున్నారని నాగ్ అశ్విన్ తెలిపారు. ఏడిద నాగేశ్వర‌రావు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గొప్ప జర్నీ. శంకరాభరణం, స్వాతిముత్యం లాంటి క్లాసిక్ మూవీలు నిర్మించిన సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారి  వార‌సులు నిర్మిస్తున్న సినిమాకు ప్రమోష‌న్‌ చేయడం సంతోషంగా వుంది. ఇంత పెద్ద సంస్థలో అవ‌కాశం వుంటే త‌ప్పకుండా నేనూ ఓ సినిమా చేస్తాను.

శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ అనుదీప్ క‌థ‌, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫ‌న్ ఉంటుంది. జాతిర‌త్నాలు హిట్ త‌ర్వాత త‌న స్వార్థం చూసుకోకుండా త‌న తోటివారిని ఎంక‌రేజ్ చేయ‌డం గ‌ర్వంగా వుంది. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` పోస్టర్ చాలా ఆసక్తికరంగా  ఉంది. యునిక్ జోన్ అఫ్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తప్పకుండా జాతిరత్నాలు సినిమాకంటే పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.  ఈ చిత్ర దర్శకుడు వంశీ ఎంబీబీఎస్ పూర్తి చేసి.. అనుదీప్ వద్ద డైరెక్షన్ లో శిక్షణ పొందారు. 
 
న‌టీనటులుగా శ్రీ‌కాంత్ రెడ్డి, సంచిత బాసు, త‌నికెళ్ళ భ‌ర‌ణి, వెన్నెల కిశోర్‌, శ్రీ‌నివాస‌రెడ్డి, మ‌హేష్ ఆచంట‌, ప్రభాస్ శ్రీ‌ను, గంగ‌వ్వ, వివిఎల్‌. న‌ర‌సింహారావు పలు పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్, మిత్రవింద మూవీస్‌ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ ఏడిద‌ నిర్మిస్తున్నారు. క‌థ, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్స్ః కె.వి. అనుదీప్‌ అందించారు. వంశీధ‌ర గౌడ్‌, ల‌క్ష్మీనారాయ‌ణ పీ ద‌ర్శక‌త్వం  వహించారు. ర‌థ‌న్‌ సంగీతం అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios