రాఘవ లారెన్స్ 'రుద్రుడు' 14.04.2023న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుంది
సరైన రిలీజ్ డేట్ పట్టుకోవటం ఓ మాదిరి సినిమాలకు చాలా కష్టమైపోతోంది. సోలో రిలీజ్ లు అసలు దొరకటం లేదు. తాజాగా సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' (Shakuntalam Movie). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. తొలుత గత ఏడాది నవంబర్ 4న సినిమాను విడుదల చేయాలని గుణ టీమ్ వర్క్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ప్లాన్ చేశాయి. అయితే, ఎందుకో ఆ తేదీకి రావడం కుదరలేదు. ఆ తర్వాత మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం మళ్ళీ వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు. 'శాకుంతలం' సినిమా కొత్త విడుదల తేదీని ఈ రోజు వెల్లడించారు. ఏప్రిల్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు.
అయితే అదే రోజు ఆ రోజు మరో రెండు సినిమాలు ఉన్నాయి. అవి తమిళ డబ్బింగ్ చిత్రాలు. అవి రాఘవా లారెన్స్ 'రుద్రుడు' , విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాలు రానున్నాయి. వీటిల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రం రుద్రుడు. నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రుద్రుడు'. ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ నుండి పొల్లాధవన్, ఆడుకాలం, జిగర్తాండ, డైరీ విజయవంతమైన బ్లాక్‌బస్టర్స్ వరుసలో తదుపరి ప్రాజెక్ట్ రాఘవ లారెన్స్ మాస్టర్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ 'రుద్రుడు'.
రాఘవ లారెన్స్ మాస్టర్ కాంచన-3 విడుదలై దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అభిమానులను, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 'ఈవిల్ ఈజ్ నా బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. రుద్రుడు సినిమా తమిళనాట భారీగా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు. రుద్రుడు రిలీజ్ తో ... శాకుంతలం కు థియేటర్స్ తమిళనాట తక్కువ దొరుకుతాయి. తెలుగులోను పోటీ ఉంటుంది. చూస్తుంటే ఏప్రిల్ 14వ తేదీన బాక్సఫీస్ వార్ గట్టిగా ఉండనుందని తెలుస్తోంది.
