టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ పై అప్డేట్ అందించారు.
అందాల రాక్షసి, భలే భలే మొగాడివోయ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి(lavanya tripathi) ప్రస్తుతం సినిమాల జోష్ తగ్గింది. అయినా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ వస్తోంది. చివరిగా ‘చావురు కబురు చల్లాగా’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన త్రిపాఠి.. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్ డే’ (Happy Birthday Movie) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంగా అర్థమైపోయింది.
ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. జూలై 15న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. దీంతో వరుసగా అప్డేట్స్ అందిస్తున్నారు. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. రేపు ఉదయం 11:07 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. చేతిలో లోడెడ్ గన్ పట్టుకుని చాలా కోపంగా చూస్తున్న లావణ్య త్రిపాఠి లుక్ అదిరిపోయింది.
ఈ చిత్రానికి ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ‘హ్యాపీ బర్త్ డే ఫిల్మ్’ రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోంది. యాక్షన్ టచ్‌తో కూడిన ఫన్ ఫుల్ డ్రామాగా తెరకెక్కుతోంది.
