సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరు సంక్రాంతిని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక రీసెంట్ గాపెళ్ళిచేసుకున్న మెగా జంట పొంగల సందడర్భంగా సర్ ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతిని సామాన్యులు.. సెలబ్రిటీలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా బెంగళూరు ఫామ్ హౌస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ అంతా అక్కడ తెగ హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతండగా.. ఈ ఫెస్టివల్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాటితో పాటు.. మెగా ఫ్యామిలీలో సంక్రాంతికి స్పెషల్ గానిలిచింది మెగా మనవరాలు.
ప్రతి పండుగని కుటుంబమంతా కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని అందరికి తెలిసిందే. ఈ సంక్రాంతి పండుగని కూడా అలాగే అందరూ కలిసి జరుపుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోకి కోడలు, మనవరాలు రూపంలో ఇద్దరు మహాలక్ష్మిల రాకతో ఈ సంక్రాంతి ఇంకాస్త ఘనంగా జరుపుకుంటున్నారు.
ఇక ఈ సెలబ్రేషన్స్ కి బెంగళూరు ఫార్మ్ హౌస్ వేదిక అయ్యింది. పండగకు ముందే అక్కడికి చేరుకున్న మెగా ఫ్యామిలీ అక్కడ పండగని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడి విశేషాలన్నిటిని మెగా వారి పెద్ద కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో అప్ డేట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మరో విషేషం ఏంటంటే.. మెగా కొత్త కోడలు లావణ్య అత్తగారింట్లో పిండివంటలు చేశారు.
స్వయంగా తన చేత్తో.. సుంన్నుండలు చుట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెమెరా వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్ళగా.. వరుణ్ పక్కకి చూడంటంటూ.. పిండి వంటలు చేస్తున్న తన భార్య, తల్లివైపు చూపించాడు. అక్కడ మెడ్రన్ డ్రెస్ లో ఉన్న లావన్య.. సున్ని ఉండలు చుడుతూ.. కనిపించింది. ఇక మెగా ఫ్యామిలీ ఈ రెండు రోజులు అక్కడే సందడి చేసి.. పండగ తరువాత హైదరాబాద్ కు రాబోతున్నారు.
