'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ తరువాత తెలుగులో కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ఆమె కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

ఇది ఇలా ఉండగా.. తనకు సంబంధించిన పార్సిల్ విషయంలో కొరియర్ సర్వీస్ నుండి కనీస సమాచారం అందకపోవడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ''బ్లూ డార్ట్.. కనీసం మీ కస్టమర్ కేర్ సర్వీస్ పని చేసేలా చూసుకోండి.

నా కొరియర్ గురించి తెలుసుకొనేందుకు కనీసం ఒక్క నెంబర్ కూడా లేదు. గతంలో ఈరోజు డెలివెరీ అవుతుందని చెప్పారు. కానీ అవ్వలేదు. చాలా నిరాశగా ఉంది'' అంటూ ట్వీట్ చేసింది.

రీసెంట్ గా లావణ్య నటించిన 'అంతరిక్షం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఘాజీ' ఫేమ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.