మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే జులాయి సినిమా వీరిద్దరి కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. 

ఇప్పుడు ఆ స్థాయిలో మరో విజయాన్ని అందుకొని హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉన్నారు. అందుకోసం అల్లు అర్జున్ సక్సెస్ పై గట్టిగానే పగ పట్టాడు. ఎందుకంటే చివరగా వచ్చిన నా పేరు సూర్య సినిమా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాపై బన్నీ నమ్మకం ఎక్కువగా పెట్టుకున్నాడు. అందుకే కథకు తగ్గట్టుగా తన ఫిట్ నెస్ లో మరిన్ని మార్పులు చేసేందుకు జిమ్ లో చెమటోడుస్తున్నట్లు తెలుస్తోంది. 

బన్నీ హెయిర్ స్టైల్ కూడా ఈ సినిమాలో మరింత న్యూ గా ఉంటుందని టాక్. దేశముదురు తరువాత ఆ స్థాయిలో ఉండే ఎనర్జీతో త్రివిక్రమ్ బన్నీ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు సమాచారం. ఫైనల్ గా సినిమా మార్చ్ చివరి వారంలో గాని లేక ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో గాని మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.  రీసెంట్ గా అభిమానులను కలుసుకున్న బన్నీ తన సరికొత్త బడి లాంగ్వేజ్ తో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి జులాయి కంటే బాబులా ఈ సినిమా ఉండాలని బన్నీ కష్టపడుతున్నాడు. మరి త్రివిక్రమ్ ఈసారి జనాల్ని ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.