టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన శ్రీహరి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో పలు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరి హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణించిన తరువాత వారసులు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి తెలిపారు.   

శ్రీహరికి ఇద్దరు కుమారులు- మేఘంష్ శ్రీహరి - శశాంక్ శ్రీహరి. ఇప్పుడు మేఘంష్ కొత్త సినిమాతో  రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానుంది. సినిమాకు రాజ్ దూత్ అనే టైటిల్ ను సెట్ చేసినట్లు సమాచారం. రొమాంటిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఆ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట. 

కార్తీక్ - అర్జున్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనిగా చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.