తెలుగులో ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ చేతిలో మూడు వందల కోట్ల విలువైన 'సాహో' సినిమాని పెట్టారు. టాలెంటెడ్ డైరెక్టర్ అయినప్పటికీ అంతటి భారీ బడ్జెట్ సినిమా చేసిన అనుభవం లేకపోవడంతో అతడిపై కొంతవరకు ప్రెషర్ పడుతోంది.

ఆ కారణంగానే తన సొంత ఆలోచనలను పక్కన పెట్టి హాలీవుడ్ ని ఫాలో అవుతూ సోషల్ మీడియాలో నెటిజన్లకు టార్గెట్ అవుతున్నాడు. ఇటీవల విడుదలైన చేసిన ఈ సినిమా పోస్టర్ ఓ హాలీవుడ్ సినిమా పోస్టర్ కి కాపీ అని సుజీత్ ని ట్రోల్ చేశారు. ఇటీవలే సినిమానుండి మ్యూజిక్ డైరెక్టర్స్ తప్పుకున్నారు.

దానికి కారణం కూడా డైరెక్టర్ అని తెలుస్తోంది. దీంతో మరో మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకొచ్చి మిగిలిన పని పూర్తి చేయాలని చూస్తుంటే అది ఇంకా ఫిక్స్ కావడం లేదు. ఇది ఇలా ఉండగా.. సినిమా టీజర్ ని విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ నుండి, బయ్యర్ల నుండి ఒత్తిడి మొదలైంది.

టీజర్ కి మ్యూజిక్ చేయడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో మళ్లీ హాలీవుడ్ వైపే చూడాల్సి వస్తోంది. ఇంటర్నెట్ లో లభించే స్టాక్ మ్యూజిక్ నుండి ఒకటి ఎంచుకొని దాని కాపీ రైట్స్ అడిగినట్లు సమాచారం. దీనికి ఇరవై వేల డాలర్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. 

అంటే ఇండియన్ మనీలో అక్షరాలా పదిహేను లక్షలు. కేవలం టీజర్ లో మ్యూజిక్ కోసమే ఇంత మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అనుభవం లేని డైరెక్టర్ ని తీసుకొని ఇప్పుడు సినిమాకు అవుతున్న అదనపు ఖర్చు చూసి నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.