టాలీవుడ్ లో సాహూ - సైరా చిత్రాల అనంతరం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం RRR. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్ మల్టీస్టారర్ వరల్డ్ వైడ్ గా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూందని చెప్పవచ్చు. 

ఇక సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ప్రస్తుతం దర్శకుడు జక్కన్న జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి బల్గెరియా లో షూటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ అనంతరం రామ్ చరణ్ కి సంబందించిన పాత్ర కోసం స్పెషల్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. అందుకోసం చరణ్ ప్రాక్టీస్ సెషన్ లో బిజీగా పాల్గొంటున్నాడు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 2020 జులై 30న RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.