బాలీవుడ్ లో బయోపిక్ ల హవా ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా మంది క్రీడాకారుల జీవితాలు తెరపైకి వస్తున్నాయి. ఇక మరో లేడి క్రికెటర్ బయోపిక్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాప్సి ఆ ప్రాజెక్ట్ లో దాదాపు ఫిక్స్ అయినట్లే. 

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ బయోపిక్ పై అమ్మడు వివరణ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే మాట్లాడటం సరి కాదని, ప్రాజెక్ట్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నట్లు తెలిపింది. ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందంటూ.. ఈ ప్రాజెక్ట్ పై నేను మాట్లాడటం కన్నా వాళ్లు అధికారికంగా చెబితేనే బావుంటుందని తాప్సి ఒక వివరణ ఇచ్చింది. 

ఇక నార్త్ మీడియా సమాచారం ప్రకారం సినిమా నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు దర్శకుడు ఎవరనేది నిర్ణయించలేదు. ప్రముఖ రచయితలతో కలిసి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సీనియర్ నిర్మాతలిద్దరు సినిమాని నిర్మించేందుకు సిద్ధపడుతున్నట్లు టాక్.