ఎట్టకేలకు మంచు మనోజ్ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కానున్నాడు. గత రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్న ఈ టాలెంటెడ్ యాక్టర్ కొత్త ప్రాజేక్టుని సెట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని మనోజ్ సినిమాలకు ధూరాం కానున్నాడని రూమర్స్ కూడా వచ్చాయి. 

అయితే ఫైనల్ గా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అనే అప్ కమింగ్ యంగ్ డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్ ను మెచ్చిన మనోజ్ అక్టోబర్ లో సినిమాను లాంచ్ చేయనున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రాజెక్ట్ కోసం మనోజ్ కూడా సరికొత్తగా కనిపించేందుకు కష్టపడుతున్నాడు. 

ఫిట్ నెస్ లో కూడా ఈ యువ హీరో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ ను ఇవ్వడానికి మనోజ్ ప్రయత్నం చేస్తున్నాడు