కథానాయకుడు డిజాస్టర్ తో నెక్స్ట్ సినిమాపై బాలకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  బోయపాటి ఇదివరకే బాలయ్య కోసం కథను సెట్ చేశాడు. అయినప్పటికీ మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తూ సినిమా స్క్రిప్ట్ చూడగానే బాక్స్ ఆఫీస్ హిట్ అనిపించాలని దర్శకుడికి గట్టిగా క్లాస్ ఇచ్చాడట బాలయ్య. 

అయితే ఆ తరువాత నందమూరి నటసింహ చేయబోయే చిత్రం మల్టీస్టారర్ అని అనేక కథనాలు వెలువడుతున్నాయి. తమిళ్ సినిమా విక్రమ్ వేద సినిమాకు రీమేక్ గా తెలుగులో చేయబోయే చిత్రంలో బాలకృష్ణతో రాజశేఖర్ నటించడానికి సిద్దమైనట్లు గత కొన్నిరోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయ్. 

అయితే ఈ విషయంపై తమిళ్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న వైనాట్ స్టూడియోస్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం వచ్చిన వార్తలన్నీ వట్టి పుకార్లే అని తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాపైనే ఎక్కువగా ద్రుష్టి పెడుతున్నట్లు సమాచారం. ఫైనల్ గా రూమర్స్ పై ఒక క్లారిటీ రావడంతో మరి ఆ సక్సెస్ ఫుల్ కథలో ఎవరు నటిస్తారు అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.