ప్రపంచవ్యాప్తంగా అభిమానులను మెప్పించిన చిత్రం 'అవతార్'. ఇలాంటి ఒక అధ్బుతాన్ని మరోసారి చూడగలమా.. అనేంతగా దర్శకుడు జేమ్స్ కెమరూన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఓ గ్రహంలో జీవించే ఒక తెగ.. తమ జీవన విధానం, తమ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం పోరాడే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'అవతార్ 2', 'అవతార్ 3' సినిమాలు వస్తున్నాయి. ఈ సీక్వెల్స్ పై నిర్మాత జోన్ లాండూ తాజా అప్డేట్స్ అందించారు.

''రెండు సినిమాల చిత్రీకరణ ఏకకాలంలో జరుగుతోంది. ముఖ్యంగా నటీనటులకి సంబంధించిన పెర్ఫార్మన్స్ చిత్రీకరణ పూర్తయింది. అవతార్ 2, 3 సీక్వెల్స్ తో పాటు 4, 5 సినిమాలకి సంబంధించిన పనులు సైతం నడుస్తున్నాయి'' అంటూ వెల్లడించారు. 

అవతార్ 2 సినిమాని డిస్నీ, ఫాక్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా ప్రకటించినట్లు డిసంబర్ 18, 2020 కాకుండా మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు హాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.