నటి దీపికా సింగ్ నివాసం దగ్గర కూడా ఓ చెట్టు తుఫాన్ ధాటికి కూలిపోయింది. ఆ చెట్టు దగ్గర వర్షంలో తడుస్తూ ఆమె ఫోటో షూట్ చేశారు.
జివ్హకో రుచి పుర్రెకో బుద్ధి అనేది పెద్దలు చెప్పిన సామెత. ఎవరి ఆలోచనలు, అభిరుచులు ఎలా ఉంటాయో చెప్పలేమని దానర్ధం. అలాగే ఏదైనా భిన్నంగా ప్రయత్నం చేసినప్పుడే జనాల అటెన్షన్ పొందగలం. ఎందుకంటే రొటీన్ విషయాలు ఎవరి దృష్టిని ఆకర్షించవు. ఐతే ఆ క్రమంలో కొందరి చేష్టలు విమర్శల పాలవుతాయి. తాజాగా టెలివిజన్ నటి చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన దీపికా సింగ్ టౌటే తుఫానులో ఫోటో షూట్ చేసింది. డాన్సులు చేస్తూ ప్రకృతి విధ్వంసాన్ని ఆస్వాదించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, తుఫాను భీభత్సం రేపుతున్నాయి. ముఖ్యంగా ముంబై తుఫాను తీవ్రతకు అతలాకుతలం అవుతుంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా, భారీ గాలులకు చెట్లు కూలిపోయాయి.
కాగా నటి దీపికా సింగ్ నివాసం దగ్గర కూడా ఓ చెట్టు తుఫాన్ ధాటికి కూలిపోయింది. ఆ చెట్టు దగ్గర వర్షంలో తడుస్తూ ఆమె ఫోటో షూట్ చేశారు. 'తుఫానును ఎవరూ ఆపలేరు. కాబట్టి ప్రకృతి చర్యను ఆస్వాదించడమే. ఈలోపు వచ్చిన దారిన తుఫాను వెళ్ళిపోతుంది. ఈ తుఫానుకు గుర్తుగా కూలిన చెట్టు వద్ద నా భర్తతో పాటు ఫోటో షూట్ చేశాను...' అంటూ సదరు ఫోటోలకు దీపికా కామెంట్ పెట్టారు.
ప్రజలు తుఫాను కారణంగా అనేక ఇబ్బందులు పడుతుంటే మీరు దానిని ఎంజాయ్ చేస్తూ ఫోటో షూట్స్ చేస్తారా... అంటూ నెటిజెన్స్ దీపికాపై విరుచుకుపడుతున్నారు. దీపికా చర్యలను పైశాచికంగా అభివర్ణిస్తున్నారు. దీపికా ఇంస్టాగ్రామ్ ఫొటోస్, వీడియో విమర్శలకు దారితీసింది.
