సోషల్ మీడియాలో గత కొంత కాలంగా వైఎస్ షర్మిళ - ప్రభాస్ లకు సంబందించిన వార్తలు ఏ స్థాయిలో దుమారాన్ని సృష్టించాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ వార్తలపై ఇటీవల సీరియస్ గా తీసుకున్న షర్మిళ రూమర్స్ క్రియేట్  చేసే యూ ట్యూబ్ ఛానెల్స్ పై అలాగే పోస్ట్ చేసిన వ్యక్తులపై పిర్యాదు చేశారు. 

రీసెంట్ గా షర్మిళ ప్రభాస్ సన్నిహితంగా ఉన్నారంటూ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరుగురుని గుర్తించిన పోలీసులు ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. యూ ట్యూబ్ నుంచి ఐపీ అడ్రస్ కనుగొని అనుమానితులను పోలీసులు పసిగట్టారు. 

ఇక నలుగురికి సిసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కావాలని తనపై అలాగే తన కుటుంబ సభ్యులపై ఈ విధంగా బురదజల్లుతున్నట్లు షర్మిళ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని విచారణను వేగవంతం చేస్తున్నారు.