సర్కార్ సినిమాతో దర్శకుడు మురగదాస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకున్నాడు. విజయ్ కథానాయకుడిగా తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పటికే 250 కోట్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమాతో ఎప్పుడు లేని విధంగా మురగదాస్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ సినిమా అలజడులు సృష్టించింది. ఇకపోతే తమిళనాడు ప్రభుత్వం కూడా మురగదాస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందుగానే హైకోర్టు లో మురగదాస్ ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

అయితే ఈ విషయంపై నేడు కోర్టు విచారణ జరుపగా ప్రభుత్వ తరపు న్యాయవాది మురగదాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సహాయంగా ఉండే పథకాలపై కించేపరిచే విధంగా సన్నివేశాలను చిత్రీకరించడం తప్పు. మరోసారి భవిష్యత్తులో తన సినిమాల్లో ప్రభుత్వ పథకాలపై ఎలాంటి నెగిటివ్ సీన్స్ ను తీయను అని మురగదాస్ లేఖ ద్వారా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో వాదోపవాదాలు విన్నకోర్టు వీలైనంత త్వరగా దర్శకుడు ఈ విషయంపై వివరణ ఇవ్వాలని బుధవారానికి కేసును వాయిదా వేయడం జరిగింది.