Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు కారం ఓటీటీలోకి అంత త్వరగానా..రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్..

ఇటీవల చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చిన వెంటనే ఓటిటిలోకి కూడా వచ్చేస్తున్నాయి. కొన్ని చిత్రాలు రెండు వారాలకే థియేటర్ లోకి వస్తుంటే మరికొన్ని నాలుగు వారాలకు వస్తున్నాయి. జనవరి 12న గుంటూరు కారం చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. 

Latest buzz on Guntur kaaram ott release date dtr
Author
First Published Jan 21, 2024, 2:23 PM IST

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఆశించిన స్థాయిలో ఘాటు చూపించలేకపోయింది. సినిమాపై మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చిన మాట వాస్తవమే. సినిమా మరీ అంత దారుణంగా అయితే లేదు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే త్రివిక్రమ్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. అంతా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, చిన్న పాటి సెంటిమెంట్ మాత్రమే కనిపించాయి.

అయినప్పటికీ మహేష్ క్రేజ్ తో ఫస్ట్ వీక్ లో గుంటూరు కారం చిత్రం మంచి వసూళ్లనే నమోదు చేసుకుంది. రెండవ వారంలో వచ్చే కలెక్షన్స్ బట్టి బయ్యర్లు సేఫ్ అవుతారా లేక నష్టపోతారా అనే లెక్కలు తేలుతాయి. 

ఇదిలా ఉండగా ఇటీవల చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చిన వెంటనే ఓటిటిలోకి కూడా వచ్చేస్తున్నాయి. కొన్ని చిత్రాలు రెండు వారాలకే థియేటర్ లోకి వస్తుంటే మరికొన్ని నాలుగు వారాలకు వస్తున్నాయి. జనవరి 12న గుంటూరు కారం చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. 

ముందుగా ఈ చిత్రం ఇద్దరు వారాల తర్వాతే ఓటిటిలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం నెల రోజుల లోపే ఈ చిత్రం ఓటిటిలోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి గుంటూరు కారం ఓటిటి హక్కులు సొంతం చేసుకుంది. తాజా సమాచారం మేరకు ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండవ వారంలో గుంటూరు కారం చిత్రాన్ని ఓటిటిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9 లేదా 10 తేదీల్లో ఈ చిత్రం ఓటిటిలోకి రాబోతున్నట్లు టాక్. 

అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బహుశా ఈ వారం థియేట్రికల్ రన్ ఎలా ఉండబోతోందో చూసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios